ఉత్తమ నగరంగా హైదరాబాద్..

250
CM congrajulates DGP-CP
- Advertisement -

హైదరాబాద్‌కు మరో ఘనత దక్కింది. భారతదేశంలోని నగరాల్లో అత్యుత్తమ జీవిన ప్రమాణాలున్న నగరంగా ఎంపికై ప్రత్యేకతను చాటుకుంది. న్యూయార్కు పట్టణానికి చెందిన మెర్సర్ సంస్థ 2016 సంవత్సరానికిగాను ప్రపంచ వ్యాప్తంగా ర్యాంకింగ్ వివరాలను విడుదల చేసింది. ఈ సందర్బంగా హైదరాబాద్ మహా నగరం దేశంలోనే ఉత్తమ నగరంగా ఎంపికైంది. ఉన్నతశ్రేణి జీవన ప్రమాణాలు కలిగి ఉండటంతోపాటు, శాంతియుత జీవనానికి, అతి తక్కువ కాలుష్యానికి, ఉత్తమ విద్యా సంస్థలకు పేరెన్నిక కన్నదని మెర్సర్ పేర్కొంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ తదితర సంబంధిత అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య ప్రజల భద్రత, వారికి కల్పించిన సురక్షిత వాతావరణం ఇందుకు తార్కాణంగా పేర్కొనవచ్చని సీఎం అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా జీవన నాణ్యత దృష్ట్యా ఆస్ట్రియా రాజధాని వియెన్నా నగరం ప్రథమ స్థానంలో ఉంది. ఎనిమిదేండ్లుగా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నది. జాబితా మొదటి పది నగరాలను చూస్తే.. ఎక్కువగా ఐరోపా నగరాలే స్థానం సంపాదించుకున్నాయి. జ్యూరిచ్ (2), మ్యూనిచ్ (4), డుసెల్‌డార్ఫ్ (6), ఫ్రాంక్‌ఫర్ట్ (7), జెనీవా (8), కోపెన్‌హాగెన్ (9)తోపాటు కొత్తగా బాసెల్ చేరింది. ఆక్లాండ్ (3), వాంకోవర్ (5) రెండు మాత్రమే ఐరోపాయేతర నగరాలు. ఆసియా, లాటిన్ అమెరికాల్లో ముందున్నవి.. సింగపూర్ (25), మాంటెవిడియో (79).

- Advertisement -