Chandrababu: ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు

20
- Advertisement -

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంపై రివ్యూ నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల నెలకి రూ.250 కోట్లు భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రలైన తెలంగాణ, కర్ణాటకకు వెళ్లి అధికారులు అధ్యయనం చేశారు. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఏపీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌తో పాటు విజయవాడ, విశాఖలోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసులలో ఉచిత సదుపాయం కల్పించే అవకాశం ఉంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:TTD:ఆగస్టులో తిరుమలలో విశేష ఉత్సవాలు

- Advertisement -