నీట్ (NEET) పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలకు సంబంధించి అస్సాం, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్‌లలో విద్యార్థులు ఇతర నిరసనకారులను నిర్బంధించినట్లు లేదా అరెస్టు చేసినట్లు వార్తలు రావడంపై కాకరోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనకారులపై ఎలాంటి శిక్షాత్మక చర్యలు తీసుకోమని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి అని వ్యాఖ్యానిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని మరియు ఎఫ్‌ఐఆర్‌లను (FIRs) ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం నిరసనకారులపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీలతో సహా తమ డిమాండ్లను కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో సీజేపీ నిరసన విరమిస్తున్నట్లు ప్రకటించిన రెండు రోజులకే ఈ ప్రకటన వెలువడింది. ప్రత్యేకించి అస్సాం, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్‌లలో ప్రభుత్వ ఏజెన్సీలు విద్యార్థులను, ఆందోళనకారులను లక్ష్యంగా చేసుకుని నిర్బంధించడం లేదా అరెస్టు చేయడంపై తమకు అనేక నివేదికలు వచ్చాయని సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఎక్స్ వేదికగా తెలిపారు.
అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేసేలా చర్యలు తీసుకుని, తమకిచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సౌరవ్ దాస్ తన ప్రకటనలో కోరారు. అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేసేలా చూసి, దేశంలో ఎక్కడా ఏ నిరసనకారుడిపై కూడా ఎలాంటి బలవంతపు లేదా ప్రతీకార చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం ముఖ్యంగా జేపీ నడ్డా గారు మరియు జితేంద్ర సింగ్ గారు తమ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాం. నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను కూడా ఉపసంహరించుకోవాలి అన్నారు.
Also Read:వీడియో.. టీచర్ ‘సెల్ఫ్ అటెండెన్స్ బోర్డ్’!
నిరసనలను తాత్కాలికంగా విరమించుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ దేశవ్యాప్త నిరసనను వాయిదా వేయాలని మేము తీసుకున్న నిర్ణయం పూర్తిగా మంచి ఉద్దేశ్యంతో తీసుకున్నది. ప్రభుత్వం తన మాటపై నిలబడుతుందనే హామీ ఆధారంగా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ హామీ నుండి వైదొలిగితే అది కాకరోచ్ జనతా పార్టీతో నమ్మకద్రోహం మాత్రమే కాకుండా, నిరసన కంటే చర్చలకే ప్రాధాన్యతనిచ్చిన లక్షలాది మంది భారతీయ యువత నమ్మకాన్ని తుంగలో తొక్కడమే అవుతుంది అన్నారు. ఇలాంటి నమ్మకద్రోహాన్ని యువత ఎంతమాత్రం అంగీకరించదు అని స్పష్టం చేశారు.

