కనకదుర్గమ్మ సన్నిధిలో సీజేఐ రమణ దంపతులు..

101
ramana
- Advertisement -

ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు. శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.జి.వాణి మోహన్ ఆలయ ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ .

శ్రీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం చేశారు ఆలయ స్థానాచార్యులు మరియు వేదపండితులు..అనంతరం శ్రీ అమ్మవారి ప్రసాదములు మరియు చిత్రపటం అందజేశారు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆలయ చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి.

- Advertisement -