సీఎం గన్‌ వీడియోపై సీజేఐ

4
- Advertisement -

అస్సాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అస్సాం బీజేపీ ‘ఎక్స్’ (X) వేదికగా షేర్ చేసిన ఓ వీడియో తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీసింది. ఆ వీడియోలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ప్రతీకాత్మకంగా ముస్లిం యువకులపై కాల్పులు జరుపుతున్నట్టు చూపించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హిమంతపై చర్యలు తీసుకోవాలంటూ సీపీఎం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది.

ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి న్యాయస్థానాలను వేదికగా మార్చకండి. రాజకీయ పోరాటాలు కోర్టుల్లో చేయవద్దు అంటూ సీపీఎంకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఎన్నికల వేళ ఇలాంటి అంశాలను న్యాయస్థానాల ముందు తీసుకురావడం తగదని ఆయన సూచించారు.

బీజేపీ అస్సాం యూనిట్ షేర్ చేసిన ఆ వీడియోలో ‘పాయింట్ బ్లాంక్ షాట్’ అనే క్యాప్షన్ కనిపించింది. అందులో హిమంత బిస్వ శర్మ ఎయిర్ రైఫిల్ పట్టుకుని ఉన్న అసలైన దృశ్యాలను, స్కల్ క్యాప్‌లు ధరించి గడ్డాలు ఉన్న వ్యక్తులపై బుల్లెట్లు తాకుతున్నట్లుగా చూపే ఏఐ (AI) సృష్టించిన విజువల్స్‌తో కలిపి చూపించారు. స్క్రీన్‌పై “ఫారినర్ ఫ్రీ అస్సాం”, “నో మెర్సీ” వంటి పదాలు కూడా దర్శనమిచ్చాయి.

Also Read:TTD:లడ్డూ విక్రయ కేంద్రాల వద్దే UPI పేమెంట్స్‌

- Advertisement -