- Advertisement -
ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే. తన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వీ రమణ పేరును సిఫారసు చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. బోబ్డే తర్వాత ఎన్వీ రమణనే సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు.
కృష్ణా జిల్లా పొన్నవరంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు రమణ.ఆయన పదవీ కాలం 2022, ఆగస్ట్ 26తో ముగుస్తుంది. 2000, జూన్ 27 నుంచి 2013, సెప్టెంబర్ 1 వరకు ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా పని చేశారు. గతేడాది అక్టోబర్‌లో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి.. ఎన్వీ రమణపై అవినీతి ఆరోపణలు చేస్తూ సీజేఐకి లేఖ రాశారు. అమరావతిలో ఆయనతోపాటు ఆయన బంధువులు భూ సేకరణ విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు జగన్ ఆరోపించారు.
- Advertisement -