కరోనా ఎఫెక్ట్…రానా హాథీ మేరీ సాథీకు బ్రేక్!

230
rana
- Advertisement -

రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న చిత్రం ‘అరణ్య’. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మూడు భాషల్లో విడుదలవుతుండగా, మూడింటిలోనూ రానా హీరోగా నటిస్తున్నారు. తెలుగు వెర్షన్ ‘అరణ్య’, తమిళ వెర్షన్ ‘కాడన్’లో రానాతో పాటు విష్ణు విశాల్, హిందీ వెర్షన్ ‘హాథీ మేరీ సాథీ’లో పుల్కిత్ సామ్రాట్ నటిస్తున్నారు.

మార్చి 26న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని సిద్ధం చేసిన ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో సినిమాను వాయిదా వేశారు మేకర్స్‌. అరణ్య , కాదన్‌ ముందుగా అనౌన్స్ చేసిన తేదీకే విడుదల చేస్తున్నా.. హిందీ వెర్షన్ రిలీజ్ మాత్రం ఆగిపోయినట్లు ప్రకటించారు మేకర్స్.

హిందీ మార్కెట్‌లో కొవిడ్-19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. త్వరలోనే హిందీ వెర్షన్ రిలీజ్ డేట్ అనౌన్స్‌ చేస్తామని తెలపగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది.

- Advertisement -