డ్ర‌గ్స్ కేసులో కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. రేవంత్‌ రెడ్డికి కోర్టు నోటీసులు..

41

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు, ఈడీ కేసుల‌కు సంబంధించి తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయవ‌ద్ద‌ని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. ఈ మేర‌కు రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీచేసింది. డ్రగ్స్ వ్యవహారంలో తనపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా వేయడం తెలిసిందే. దీనిపై ఈరోజు విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది.

డ్రగ్స్, ఈడీ కేసుల్లో టీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రేవంత్ రెడ్డిని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 20కి వాయిదా వేసింది. డ్రగ్స్ నేపథ్యంలో కొన్నిరోజుల కిందట రేవంత్ రెడ్డి స్పందిస్తూ, మంత్రి టీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ టెస్టు చేయించుకుని తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వైట్ ఛాలెంజ్ విసిరారు. అందుకు దీటుగా బదులిచ్చిన కేటీఆర్, ఆపై రేవంత్ మీద పరువునష్టం దావా వేశారు.