- Advertisement -
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నుండి ఆమోదం పొందిన తర్వాత, సిప్లా భారతదేశంలో మొట్టమొదటి ఇన్హేలబుల్ ఇన్సులిన్, అఫ్రెజాను ప్రారంభించింది. USAలోని మాన్ కైండ్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన అఫ్రెజా, డయాబెటిస్‌ను వేగవంతంగా నియంత్రించడంలో సాయపడుతుంది.
టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు ఇంజెక్షన్ ఇన్సులిన్ చికిత్సలతో ఇబ్బంది పడేవారికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరుస్తుంది. ఇన్హేలబుల్ ఇన్సులిన్ రాకతో సాంప్రదాయ ఇంజెక్షన్లకు ఖచ్చితంగా ప్రత్యామ్నాయమనే చెప్పాలి.
ప్రపంచంలో డయాబెటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. తాజాగా భారతదేశంలో సిప్లా అఫ్రెజాను ప్రవేశపెట్టడం ద్వారా ఖచ్చితంగా ఓ ముందడుగనే అంతా అభిప్రాయపడుతున్నారు.
Also Read:గేమ్ చేంజర్..అద్భుతంగా ఉండబోతోంది:సూర్య
- Advertisement -