50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌కు అనుమతి..

123
Theatre
- Advertisement -

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా మూతపడిన థియేటర్స్ మళ్లీ తెరుచుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగానే తగ్గుతున్నాయి. దాంతో థియేటర్స్ తెరుచుకోడానికి ఏపీ ప్రభుత్వం తాజాగా అనుమతులు ఇచ్చేసింది. జులై 8 నుంచి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చు అంటూ సర్కార్ అనుమతులు ఇచ్చేసింది. తెలంగాణలో మాత్రం 100 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ ఓపెన్ చేసుకోవాలంటూ అనుమతులు ఇచ్చేసింది ఇక్కడి ప్రభుత్వం.

అయితే అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్స్ తెరిచినా కూడా ప్రేక్షకులు వస్తారా అనేది అనుమానమే. ఎందుకంటే మరో నెల రోజుల్లోనే కరోనా థర్డ్ వేవ్ కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలో థియేటర్స్ వరకు ప్రేక్షకులు వచ్చేది డౌట్ ఫుల్ గానే ఉంది. మరోవైపు థియేటర్స్ తెరిచినా సినిమాలు మాత్రం రావడం లేదు.

సెకండ్ వేవ్ తీవ్రత చూసిన తర్వాత థియేటర్స్ అంటేనే భయపడుతున్నారు ప్రేక్షకులు. తెలుగు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా.. అసలు సమస్య ఇక్కడే ఉంది. థియేటర్స్ ఓపెన్ చేయడం వరకు ఓకే కానీ సినిమాలు విడుదల చేస్తారా అనేది అసలు సమస్య. నిర్మాతలు ఇప్పటికీ ఓటిటి వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో థియేటర్స్ తెరిచినా ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలి.

- Advertisement -