మళ్లీ థియేటర్లు మూసివేత…!

202
cinema theatre
- Advertisement -

దాదాపు 9 నెలల తర్వాత దశల వారీగా థియేటర్లు తెరుచుకుంటుండగా అంతలోనే సినీ ప్రేక్షకులకు చేదువార్త. మార్చి 1 నుండి థియేట‌ర్స్ మూసివేస్తామంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు ఎగ్జిబిట‌ర్స్ . రామానాయుడు స్టూడియోలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మ‌ధ్య మీటింగ్ జ‌ర‌గ‌గా, ఈ మీటింగ్‌లో ప‌లు డిమాండ్స్ వారి ముందుంచారు. వీటిని ఒప్పుకోని ప‌క్షంలో మార్చి 1 నుండి థియేట‌ర్స్ మూత‌బ‌డ‌తాయి అని స్ప‌ష్టం చేశారు.

థియేట‌ర్స్‌లో విడుద‌లైన 6 వారాల త‌ర్వాత పెద్ద సినిమాలు, 4 వారాల త‌ర్వాత చిన్న సినిమాల‌ని ఓటీటీలో విడుద‌ల చేయాలన్నారు. అలా చేస్తేనే మంచి థియేట్రిక‌ల్ ర‌న్ ఉంటుంద‌ని వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, డివివి దానయ్య, అభిషేక్ నామా, ఆసియన్ సునీల్, మైత్రీ మూవీస్ నిర్మాతలు, బివిఎస్ఎన్ ప్రసాద్ హాజరు కాగా, వీరు ఎగ్జిబిట‌ర్స్ కండీష‌న్స్‌కు క‌ట్టుబ‌డి ఉంటే సినిమాలు య‌ధావిదిగా థియేట‌ర్‌లో ప్ర‌ద‌ర్శితం అవుతాయన్నారు.

- Advertisement -