కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో సినిమా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్ల ఓపెనింగ్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. 50 శాతం వరకూ సీట్ల సామర్థ్యంతో సినిమా థియేటర్లను నిర్వహించుకునేందుకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. టికెట్ల రేట్లు పెంచుకునే అధికారం యాజమాన్యాలకు కల్పించింది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనుందుకే నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ముఖ్యమైన నిబంధనలు..
– 50 శాతం సిట్టింగ్ కెపాసిటీతో ప్రారంభం.
– ప్రతి వ్యక్తి మాస్క్ ధరించాలి.
– సానిటైజార్ ఉంచాలి.
– భౌతిక దూరం ,గుంపులు గుంపులుగా తిరగడం నిషేధం.
– ప్రతి షో ముందు కామన్ ఏరియాలో సానిటీజేషన్ చేయాలి.
– టెంపరేచర్ 24 నుంచి 30 డిగ్రీ సెల్సీయస్ మధ్య ఉంచాలి.
– హ్యూమినీటిని 40 నుంచి 70 శాతం మధ్య మెంటెన్ చేయాలి.