- Advertisement -
సినీ పరిశ్రమ సమస్యలపై ఇవాళ ఇండస్ట్రీ పెద్దలు సమావేశం కానున్నారు. ఇండస్ట్రీలోని 24 శాఖలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కొద్దిరోజులుగా సినిమా టికెట్ రేట్లపై గందరగోళం నెలకొనగా ఆ సమస్యపై కూడా ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అగ్రహీరోలతో పాటు నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు హాజరుకానుండగా హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే పలుమార్లు టికెట్ రేట్లకు సంబంధించిన అంశంపై ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి నేతృత్వంలో పలవురు కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -