భారత్‌లో సిగరెట్లపై కొత్త పన్ను విధించడంతో ఒక్క సిగరెట్ ధర రూ.72కి చేరుతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి పూర్తిగా తప్పుడు ప్రచారం అని స్పష్టమవుతోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన ఎక్సైజ్ డ్యూటీ ఒక్కో సిగరెట్‌పై కాకుండా ప్రతి 1,000 సిగరెట్లపై విధించబడుతుంది. దీని వల్ల వాస్తవంగా ఒక్కో సిగరెట్‌పై పన్ను పెరుగుదల రూ.2.50 నుంచి రూ.10.30 మధ్యలోనే ఉంటుంది.
కొత్త సిగరెట్ పన్నుపై సోషల్ మీడియా నుంచి వీధి చర్చల వరకు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త పన్నుతో ఒక్క సిగరెట్ ధర రూ.18 నుంచి రూ.72కి పెరుగుతుందన్న ప్రచారం జరిగింది. అయితే వాస్తవ పన్ను నిర్మాణాన్ని పరిశీలిస్తే ఆ వాదన తప్పని స్పష్టమవుతుంది. ధరలు పెరగడం ఖాయమే కానీ రూ.72 అన్న మాటకు ఎలాంటి ఆధారం లేదు.
సిగరెట్లపై పన్ను ఎలా విధిస్తారు?
భారత్‌లో సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీ ప్రతి 1,000 సిగరెట్లకు విధిస్తారు.
పాత డ్యూటీ (1,000 సిగరెట్లకు):
రూ.200 నుంచి రూ.735 వరకు
ఒక్క సిగరెట్‌కు:
రూ.0.20 నుంచి రూ.0.735
కొత్త ప్రతిపాదిత డ్యూటీ (1,000 సిగరెట్లకు):
రూ.2,700 నుంచి రూ.11,000 వరకు
ఒక్క సిగరెట్‌కు:
రూ.2.70 నుంచి రూ.11.00
ప్రస్తుతం రూ.18 ఉన్న సిగరెట్ ధరపై మొత్తం పన్ను వినియోగదారుడిపై మోపితే, ధర రూ.21 నుంచి రూ.28 మధ్య ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక్క సిగరెట్ ధర రూ.72 అవుతుందన్న వాదన పూర్తిగా తప్పు. గత అనుభవాల ప్రకారం, మోస్తరు ధరల పెరుగుదల పొగతాగేవారి సంఖ్యను కొంత తగ్గించవచ్చు కానీ పూర్తిగా ఆపదు. కొందరు బ్రాండ్లు మార్చవచ్చు లేదా తక్కువగా తాగవచ్చు. మొత్తానికి, సిగరెట్ ధరలు పెరుగుతాయి కానీ రూ.72 అన్న ప్రచారం నిజం కాదు.
Also Read:తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ

