తన తండ్రి కంటే తన భార్య అంటే ఎక్కువగా భయపడతానని అన్నారు నటుడు మంచు విష్ణు. మోహన్ బాబు అంటే ఏమాత్రం భయం లేదని కానీ తన భార్యకు ఎక్కువగా భయపడగానని అన్నారు నటుడు మంచు విష్ణు. ఈసందర్భంగా తన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు చెబుతూ బుధవారం ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాటుగా ఇన్‌స్టాగ్రామ్‌లోను ఓ వీడియోను పంచుకున్నారు.
ఆమెను చూసిన ప్రతిసారీ నేను మళ్లీ ప్రేమలో పడుతూనే ఉంటాను. సరదాలు సంతోషాలు విహారయాత్రలు ఇలా చెబుతూ వెళ్తే నా జీవితంలోని ప్రతిక్షణం తాను తోడైనందుకు ఆనందిస్తున్నా. లవ్ యూ అని మంచు విష్ణు పేర్కొన్నారు. మంచు విష్ణు విరానికి 2008లో పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. విష్ణు నటించిన జిన్నా గతేడాది విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ఆడలేక మిశ్రమ స్పందనలకు పరిమితమైంది.
The only person I am more scared of, more than my dad, @vinimanchu. I love you to the moon and back. Happy anniversary ❤️ pic.twitter.com/GEAZTdPMPa
— Vishnu Manchu (@iVishnuManchu) March 1, 2023
ఇవి కూడా చదవండి…
పవన్ – సాయి తేజ్’ కి హీరోయిన్లు ఫిక్స్
ప్రియాంక త్రివేది… ‘డిటెక్టివ్ తీక్షణ’
‘దసరా’ లో హైలెట్స్ ఇవే !