గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన క్రిస్టియాన IAS

374
Christina IAS
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయం OSD (హరిత హారం) ప్రియాంక వర్గీస్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య భవనంలోని తన కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టియాన.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పచ్చదనం పెంచడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంకు స్ఫూర్తిగా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతంగా ముందు కొనసాగుతుందని.. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ చాలెంజ్ ఈ విధంగా కొనసాగాలని మరొక ముగ్గురు యోగితా రానా ముఖ్య కార్యదర్శి సాంఘిక సంక్షేమ శాఖ,దివ్య దేవరాజన్ ముఖ్య కార్యదర్శి శిశు సంక్షేమ శాఖ, సోనీ బాల అదనపు కార్యదర్శి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -