కోకాపేటలో క్రైస్తవ భవన్‌కు శంకుస్ధాపన…

620
sabitha
- Advertisement -

హైదరాబాద్ కోకాపేటలో క్రైస్తవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్,స్టీఫెన్ సన్,ఎమ్మెల్సీ రాజేశ్వరరావు ,స్పెషల్ చీఫ్ సెక్రటరీ మైనార్టీ వెల్ఫేర్ అజయ్ మిశ్రా,మైనార్టీ శాఖ సలహాదారు ఏకే ఖాన్,క్రిస్టియన్ వెల్ఫైర్ డైరెక్టర్ క్రాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కొప్పుల ఈశ్వర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలను సమానంగా చూస్తున్నారని చెప్పారు. అన్ని కులాల ,మతాల విశ్వాసాలను కాపాడుతూ వారికి కావలసిన సహకారాన్ని అందిస్తున్నారు. మైనార్టీలు ఆర్థిక ప్రగతి సాధించాలని అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాక ముందు క్రైస్తవులు అభద్రతా భావంతో ఉండేవారు,తెలంగాణ వచ్చాక వారికి సంపూర్ణ విశ్వాసం ,అండదండలు కల్పిస్తూ భయం లేకుండా జీవించేలా కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం..అన్నివర్గాల వారికి ఇచ్చినట్లు క్రైస్తవ వివాహాలకు కూడా లక్ష నూట పదహార్లు ఇస్తున్నాం..క్రిస్టియన్ భవన నిర్మణానికి మొట్ట మొదట సంకల్పించింది గుర్తించింది సీఎం కేసీఆర్ అన్నారు.

ఇంత పెద్ద మహా నగరంలో క్రిస్టియన్ సమాజానికి ఒక భవనం ఉండాలని అందరూ గుర్తుంచుకునేల మంచి భవనాన్ని నిర్మించాలని సంకల్పించారని..కొకాపెట్ లో రెండు ఎకరాలు కేటాయించడమే కాకుండా భవన నిర్మాణానికి 10 కోట్లు కేటాయించారని చెప్పారు. పేద క్రైస్తవ సోదరులకు గ్రామాల్లో ఉండే వారికి లక్షా యాభై వేల మందికి కొత్త బట్టలు కొనివ్వడం చాలా గొప్ప విషయం అన్నారు.

ప్రతి జిల్లా లో ,ప్రతి నియోజకవర్గంలో క్రైస్తవ విందులు ఏర్పాటు చేస్తున్నాం..క్రిస్టియన్ స్మశానవాటిక కోసం 63 ఏకరాలు కేటాయించడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ను అక్కున చేర్చుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం..అందరూ కలిసి మెలిసి ఉండి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రభుత్వానికి మీ ఆశీస్సులు అందజేయాలన్నారు.

అన్ని కులాల భవనాలు కోకాపెట్ లో రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జీసస్ కృప ,సీఎం కేసీఆర్ కృషి వల్ల ఈ క్రిస్టియన్ భవనం ఇక్కడ నిర్మిచడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ మంచి మనసున్న వ్యక్తి …తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ అన్ని కులాలను సమ దృష్టితో చూస్తున్నారని చెప్పారు. ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా అన్ని పండుగలను ప్రభుత్వ పరంగా జరిపిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రాకుండా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి కావాలని ప్రార్థనలు చేయాలన్నారు.

- Advertisement -