చో రామస్వామి కన్నుమూత

336
Cho Ramaswamy passes away
- Advertisement -

సీనియర్ నటుడు, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు చో రామస్వామి(82) బుధవారం కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు శ్రీనివాస అయ్యార్‌ రామస్వామి. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున 4:40గంటలకు తుది శ్వాస విడిచారు.

Cho Ramaswamy passes away

థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత పలు సినిమాల్లో నటించారు. ‘మహ్మద్ బీన్ తుగ్లక్’ నాటకంతో గుర్తింపు పొందారు. తుగ్లక్ పత్రిక స్థాపించి వ్యంగ్యస్త్రాలు సంధించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. ఆమె సలహాదారుగా పనిచేశారు.

Cho Ramaswamy passes away

జయలలితతో కలిసి అనేక సినిమాలు, నాటకాల్లోనూ నటించారు. తుగ్లక్‌ నాటకం ద్వారా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. నటి రమ్యకృష్ణకు ఆయన మేనమామ. తుగ్లక్‌ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరిస్తూ రాజకీయ విశ్లేషణలు చేశారు. దేశంలోని అనేకమంది రాజకీయ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఆయన అత్యంత సన్నిహితుడు. ఆయన 1999-2005 కాలంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కాగా, రామస్వామి.. సినీనటి రమ్యకృష్ణ మేనమామ.

- Advertisement -