25 గెటప్స్‌లో చియాన్ విక్రమ్..!

563
vikram
- Advertisement -

విలక్షణ పాత్రలు,సినిమాలకు పెట్టింది పేరు చియాన్ విక్రమ్‌. కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్దపడే విక్రమ్ తాజాగా మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు.తన కొత్త సినిమాలో ఏకంగా 25 గెటప్స్‌లో కనిపించబోతున్నాడు.

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విక్రమ్. చెన్నైలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాగా ఈ మూవీలో విక్రమ్ 25 గెటప్స్ లో కనిపించనున్నాడు. దీని కోసం యూరోప్ నుంచి ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్టుల్ని రప్పించారు. వాళ్లు 4 నెలల పాటు ఇక్కడే ఉండి, విక్రమ్ కు రకరకాల గెటప్స్ వేస్తారన్నమాట. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

గతంలో విక్రమ్…అపరిచితుడు సినిమాలో చేసిన నటన ఇప్పటికి అందరికి గుర్తుండే ఉంటుంది. పోలీస్ లాకప్‌లో ప్రకాశ్‌ రాజ్‌తో సీన్‌లో నటవిశ్వరూపం చూపించాడు విక్రమ్‌.

- Advertisement -