రోజురోజుకు మారుతున్న జీవన విధానం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. నేటిరోజుల్లో చాలమంది ఎదుర్కొనే సమస్యలలో శృంగార సమస్యలే అధికంగా ఉన్నాయని పలు అద్యయానాలు చెబుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే శృంగార సమస్యలు అధికంగా ఉన్నాయట. అధిక పని ఒత్తిడి కారణంగా అలాగే మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్ల కారణంగా.. పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గిపోతోంది. పురుషులు ఎదుర్కొనే శృంగార సమస్యలలో అంగస్తంభన, శీఘ్రస్కలనం, వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలే అధికం.
అంతే కాకుండా ఈ సమస్యలను ఎదుర్కోవడంపై పురుషుల్లో సరైన అవగాహన లేనందున చాలా మంది వారిలో వారే మదనపడుతుంటారు. అయితే పురుషుల్లో వచ్చే సర్వసాధారణ శృంగార సమస్యలను ఎదుర్కోవడానికి వ్యాయామం ఎంతో అవసరం. ప్రతిరోజూ శారీరక శ్రమ వల్ల టేస్ట్రోస్టిరాన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది పురుషుల్లో శృంగార వాంచాలను పెంచడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇక కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా టేస్ట్రోస్టిరాన్ హార్మోన్ పెంచే ఆహార పదార్థాలను కూడా డైలీ ఫుడ్ డైట్ లో జత చేసుకోవాలి. కాగా లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో చియా విత్తనాలు ఎంతగానో ఉపయోగ పడతాయని నిపుణులు చెబుతున్నారు.
చియా విత్తనల్లో ఒమేగా 3, ఫ్యాటి యాసిడ్స్, ప్రోటీన్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే కేఫిక్ యాసిడ్, రోస్మరినిక్ యాసిడ్ వంటివి కూడా అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో ఎంతగానో ఉపయోయ పడతాయి. అందుకే శృంగార సమస్యలతో భాదపడే వాళ్ళు తినే ఆహారంలో చియా విత్తనాలను జత చేసుకోవడం ఎంతో మంచిదట. ఇక ఆడవారిలో కూడా పునరుత్పత్తి వ్యవస్థను మెరుగుపరచడంలో చియా విత్తనాలు ఎంతో ప్రయోజనకరం. ముఖ్యంగా గర్భదరణ సమయంలో మహిళలు చియా విత్తనాలు తింటే పాల ఉత్పత్తి పెరుగుతుందట. ఇందులో ఉండే మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫైబర్, కారణంగా ఆరోగ్యకరమైన అండాలు విడుదల కావడంలోనూ, అలాగే పునరుత్పత్తి అవయవాలకు రక్తప్రసరణను మెరుగుపరచడంలోనూ చియా విత్తనాలు ఎంతగానో ఉపయోగ పడతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి లైంగిక సమస్యలతో భాద పడే వాళ్ళు తప్పనిసరిగా చియా విత్తనాలు రొటీన్ ఫుడ్ లిస్ట్ లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
( గమనిక : ఈ వ్యాసం ఇంటర్నెట్ లోని కొంత సమాచారం మేరకు మీ అవగాహన కొరకు అందించడం జరుగుతుంది. కచ్చితత్వానికి, విశ్వసనీయత కు ఈ వ్యాసం ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. కాబట్టి అనారోగ్య తీవ్రత అధికంగా ఉన్నప్పుడూ వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమం )