హత్యకేసు..చిత్తూరు కోర్టు సంచలన తీర్పు

7
- Advertisement -

మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త హత్యకేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాశ్ రెడ్డి, మంజునాథ్, వెంకటేశ్‌లకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

2015 నవంబర్‌లో మేయర్ దంపతులను హత్య చేశారు. పదేళ్ల విచారణ అనంతరం తుది తీర్పు వెలువరించింది న్యాయస్థానం. రెండు హత్యలు, కుట్ర, హత్యాయత్నం, ప్రభుత్వ కార్యాలయంలో ఘటనను సీరియస్ గా తీసుకుంది కోర్టు.

తీర్పు వెల్లడించింది చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు. చంద్రశేఖర్ అలియాస్ చింటు, వెంకటచలపతి అలియాస్ వెంకటేష్, జయప్రకాష్ రెడ్డి, వెంకటేష్, మంజునాథ్‍లకు ఉరిశిక్ష విధించగా ఏ1 నుంచి ఏ5 వరకు నేరం చేసినట్లు నిర్ధారణ అయింది. మిగిలిన 18 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది న్యాయస్థానం.

Also Read:సుజీత్‌పై ఇమ్రాన్ ప్రశంసలు

- Advertisement -