ఉద్యోగాల పేరుతో ఘరానా మోసాలు.. నిందితుడు అరెస్ట్..

40
- Advertisement -

జల్సాల కోసం మోసాలకు పాల్పడుతున్న నేరస్తుడిని చిత్తూరు పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న నేరస్తుడిని అరెస్ట్ చేసి కటకటాల పాలు చేశారు. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసి దాదాపు కోటి 27 లక్షల 80 వేల రూపాయలు మోసం చేసిన కేసులో తవణంపల్లి మండలం అరగొండ గ్రామానికి చెందిన హేమంత్ ను అరెస్టు చేయడం జరిగిందని చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి తెలిపారు.

రైల్వే శాఖలో తాను ఉన్నత అధికారి అని పై అధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయని ఉద్యోగం ఇప్పిస్తానని నకిలీ ఉత్తర్వులు ఇప్పించి పలువురిని మోసం చేసిన కేసులో తిరుపతి, బంగారుపాలెం, కాణిపాకం, యాదమరి, పాకాల, చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో హేమంత్ పై కేసులు నమోదైనట్లు డిఎస్పి తెలిపారు. నిరుద్యోగులను మోసం చేసి గోవాలో జరిగే క్యాసినో జూదంలో నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన 70 లక్షల రూపాయలు జల్సా చేశాడు. మిగిలిన పైకంతో అరగొండలో ఒక ఇల్లు కట్టుకున్నాడు. పూతలపట్టులో సొంత ఇంటిని మరమ్మతులు చేయించాడు.. పూతలపట్టులో వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. ఇలాంటి మోసగాళ్ల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ కోరారు .ఈ మీడియా సమావేశంలో చిత్తూరు వన్ టౌన్ సీఐ నరసింహ రాజు, ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.

- Advertisement -