డైరెక్టర్ తేజ పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను రూపొందించారు. అయితే, ఆయన దర్శకునిగా పరిచయమైన ‘చిత్రం’ ఆయన కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తేజ తీర్చిదిద్దిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఆ ఫిల్మ్‌తోటే దివంగత ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయమయ్యారు. ఆ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సమకూర్చిన సంగీతం ఒక హైలైట్‌గా నిలవడమే కాకుండా, పాటలన్నీ ఒక సెన్సేషన్‌ను సృష్టించాయి.
నేడు తేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘చిత్రం’కు సీక్వెల్‌ను ప్రకటించారు. అంతా కొత్త తారలు నటించే ఆ మూవీకి ‘చిత్రం 1.1’ అనే టైటిల్ ఖరారు చేశారు. మ్యూజికల్ యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీగా రూపొందే ఈ సినిమా ద్వారా 45 మంది కొత్తవారిని తేజ పరిచయం చేస్తున్నారు. ‘చిత్రం 1.1’తో తేజ, ఆర్పీ పట్నాయక్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ మళ్లీ వస్తోంది. ‘చిత్రం’ తరహాలోనే ఈ సీక్వెల్ సైతం మ్యూజికల్ హిట్టవడం ఖాయం. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, శంకర్ కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
చిత్రం మూవీస్ బ్యానర్‌పై తేజ స్వయంగా నిర్మిస్తున్న ఈ ఫిల్మ్‌కు ఎస్ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామి. మార్చిలో ‘చిత్రం 1.1’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. త్వరలో ఇతర వివరాలను వెల్లడిస్తారు.
సాంకేతిక బృందం:
నిర్మాత-దర్శకుడు: తేజ
బ్యానర్స్: చిత్రం మూవీస్, ఎస్ స్టూడియోస్
మ్యూజిక్: ఆర్పీ పట్నాయక్
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
కొరియోగ్రఫీ: శంకర్
పీఆర్వో: వంశీ-శేఖర్.