తేజు…చిత్రలహరి అప్‌ డేట్స్‌

265
chitralahari
- Advertisement -

కిశోర్ తిరుమల దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ హీరో సాయిధరం తేజ్ ప్రస్తుతం ‘చిత్రలహరి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో జరుగుతోంది. తేజు సరసన కల్యాణి ప్రియదర్శిన్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తొలుత ఈ సినిమా కథను హీరో నాని కోసం రాసిన కిషోర్ తిరుమల ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌తో తెరకెక్కిస్తున్నారు. ‘చిత్రలహరి’ అనే ఓ ‘బార్’ చుట్టూ కథ తిరుగుతుందట. అందువలన ఈ సినిమాకి ఈ టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ త్వరలో విడుదల కానుంది.

chitralahari movie updates

సాధారణంగా తేజు తన సినిమాల ఎడిటింగ్ సమయంలో చిరూకి చూపించి సలహాలు .. సూచనలు అడిగేవాడు. అలాంటిది ‘చిత్రలహరి’ షూటింగుకి ముందే కథను చిరంజీవికి చెప్పించాడట. చిరు కొన్ని మార్పులు .. చేర్పులు చెప్పినట్టుగా సమాచారం.కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

- Advertisement -