సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా `నేను శైలజ` ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ నిర్మిస్తోన్న చిత్రం `చిత్రలహరి`. సాయిధరమ్ తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో `గ్లాస్ మేట్స్ …` అనే పాటను ఖమ్మంలో విడుదల చేశారు.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ “మన జీవితంలో ఫెయిల్యూర్ మనకు బెస్ట్ టీచర్. అవి మనకు చాలా విషయాలు నేర్పిస్తాయి. పాఠాలతో పాటు ఫెయిల్యూర్స్ కూడా చాలా నేర్పుతాయి. కాలేజీ లైఫ్‌ని అందరూ బాగా ఎంజాయ్ చేయండి. నేనెప్పుడూ మిస్ అయినట్టు ఫీల్ అయ్యేది నా కాలేజ్ లైఫ్‌ని. అందరూ బాగా ఎంజాయ్ చేయండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మా మెగా ఫ్యాన్స్ కి దన్యవాదాలు. వాళ్ల సపోర్ట్ ఎప్పుడూ ఉన్నందుకు చాలా థాంక్స్“ అని అన్నారు.
ఈ సందర్భంగా… సునీల్ మాట్లాడుతూ “నా లైఫ్‌లో నేను మర్చిపోనిది చిత్రలహరి. విడుదలైన సినిమాల్లోని పాటలను కొంచెం కొంచెం అందులో వేసేవారు. అప్పుడు మా మేస్టార్ అనేవాడు `వీడు పొద్దున్నే, మధ్యాహ్నం స్కూల్‌కి రావడం లేదు. కానీ శుక్రవారం సాయంత్రం పాటల టైమ్‌కి వస్తాడు అప్పుడు క్యాచ్ చేయాలని అనుకునేవారు ఆయన. వాళ్లింట్లో టీవీ ఉండటం వల్ల అలా వెళ్లేవాడిని. కాకపోతే ఎగ్జామ్స్ ముందు కష్టపడి చదివి సెకండ్ క్లాసులో పాస్ అయ్యేవాడిని. అందరూ ఏదైతే కష్టమనుకుంటారో అదే సుఖం. ఏదైతే సుఖమనుకుంటారో అదే కష్టం. వారం రోజులు బాగా తిని, ఏసీ రూమ్‌లో పడుకుంటే `బాబూ నీకు షుగర్ వచ్చింది` అని అంటాడు. ఎక్కువ తినొద్దని అంటాడు. అంటే మనం సుఖపడ్డందుకు వచ్చిన కష్టం అది. అదే మనం బాగా కష్టపడి కాస్త నీరసంగా అనిపించి డాక్టర్ దగ్గరికి వెళ్లామనుకోండి. `బాగా తినండి` అని చెబుతాడు. నచ్చింది తినమంటే సుఖమే కదా. అలా ఎప్పుడూ కష్టపడితే సుఖం ఉంటుందని అర్థం చేసుకోవాలి“ అని అన్నారు.