సైరా….పవర్‌ఫుల్‌ డైలాగ్‌ లీక్‌ చేశారు…

210
SYE RAA NARASIMHA REDDY

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవిత నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం సైరా. ఈ సినిమా పై మెగాస్టార్‌ చిరంజీవి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. చిరు కెరీర్‌లోనే ఇదో అత్యంత ప్రతిష్టాత్మకమైన మూవీ.

CHIRU'

రీసెంట్‌ గా..చిరు బర్త్‌డే రోజున ఈ సినిమా టీజర్‌ రిలీజైంది. రిలీజైన 24 గంటల్లోనే 12 మిలియ‌న్ డిజ‌ట‌ల్ వ్యూస్ సాధించి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ టీజర్‌. ఒక్క టీజ‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగిపోయాయి.

అయితే తాజాగా ఈ సినిమాలోని ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని పరచూరి గోపాల‌కృష్ణ లీక్‌ చేశారు. ‘‘చేతులు వెనక్కి విరిచి కట్టేశాం. ముఖం ముందు ఉరితాడు వేలాడుతోంది. ఏంటిరా? ఆ ధైర్యం.. చావు భయం లేదా నీకు?’ అని అంటే ‘చచ్చి పుట్టినవాడిని.. చనిపోయిన తర్వాత కూడా బతికే వాడిని చావంటే నాకెందుకురా భయం’ అనే డైలాగ్ చెప్పారు. ఈ డైలాగ్ మెగా అభిమానుల‌లో జోష్ నింప‌డం ఖాయం అని అంటున్నారు. బుర్రా సాయి మాధ‌వ్ సైరా కోసం ప‌వర్ ఫుల్ డైలాగులు రాస్తున్న సంగ‌తి తెలిసిందే.

Sye Raa Narasimha Reddy DIALOGUE Revealed by Paruchuri Gopala Krishna | Paruchuri Palukulu