సైరా…లుక్ లీక్…!

208
Chiru's Sye Raa look Leaked
- Advertisement -

ఖైదీ నెంబర్ 150తో బంపర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకువస్తున్నారు. టాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

చిరుతో పాటు న‌య‌న‌తార, అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తి బాబు, విజ‌య్ సేతుప‌తి, సుదీప్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్ర‌స్తుతం నానక్‌రామ్‌గూడ‌లో వేసిన భారీ సెట్‌లో సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. చిరంజీవికి గురువు పాత్రలో ఈ సినిమాలో బిగ్ బీ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగులో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న బిగ్ బీ..‘సైరా’ షూటింగ్‌లో పాల్పంచుకుంటున్న విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ తన లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Chiru's Sye Raa look Leaked

తాజాగా అదుర్స్ అనిపించే మరో ఫొటో లీకైంది. నయనతారతో కలిసి ఓ యజ్ఞం నిర్వహిస్తున్న చిరంజీవి లుక్స్ అదిరిపోయేలా ఉన్నాయి. పక్కనే కూర్చున్న గురువు అమితాబ్ ఈ మహా కార్యాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అదిరిపోయే క్యాస్టూమ్స్‌తో చిరంజీవి, నయనతార లుక్స్.. కన్నార్పకుండా చూసేలా, అభిమానులు పండగ చేసుకునేలా ఉన్నాయి

చిత్రానికి సంబంధించి విడుద‌లైన తొలిఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. చిరు, న‌య‌న‌తార‌, అమితాబ్ గెట‌ప్స్ అభిమానుల‌కి పిచ్చి పిచ్చిగా న‌చ్చేశాయి. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సైరా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -