నల్గొండ జిల్లా రైతులకు సీఎం రేవంత్ రెడ్డి రూ.800 కోట్లు బాకీ పడ్డారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. మీడియాతో మాట్లాడిన ఆయన..రైతుబంధు కోసం కేసీఆర్ జమ చేసిన డబ్బులను అధికారంలోకి రాగానే రైతులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకుని బిల్లులు ఇచ్చారు అని ఆరోపించారు.
నల్గొండ జిల్లాలోని ఎమ్మెల్యేలకు దొరికింది దోచుకోవడమే సరిపోతుంది…కబ్జాలు, ఆక్రమణలకే పెద్ద పీట వేస్తున్నారు అని దుయ్యబట్టారు. కమిషన్లు వచ్చే పనులనూ పట్టుకుని సీఎం చుట్టూ తిరిగేందుకు ఎమ్మెల్యేలకు సమయం సరిపోతలేదు అని ఆరోపించారు.
కేటీఆర్‌కు పదే పదే విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నాను… మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసులు, నోటీసులు. కేటీఆర్ మీదనే 14 అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా.. బీఆర్ఎస్ భయపడబోదు. ప్రజల్లో ఉండి ప్రభుత్వంపై పోరాట చేస్తాం. స్థానిక ఎన్నికల కోసమే రైతు భరోసా అని మండిపడ్డారు.
Also Read:థాయ్‌లాండ్‌కు ఉన్న జ్ఞానం కూడా లేదా?

