మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. మోహన్ రాజా డైరెక్టర్‌గా, శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్స్‌పై ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు(ఆగస్ట్ 22) సందర్భంగా టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
మోషన్ పోస్టర్‌ను గమనిస్తే.. మెగాస్టార్ అనే పేరులోని అక్షరాలు ‘గాడ్ ఫాదర్’గా మారడాన్ని గమనించవచ్చు. అలాగే చిరంజీవి నీడ, చెస్ కాయిన్ స్టైల్లో టైటిల్‌కు యాప్ట్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ వింటుంటే ఓ ఎనర్జీ వస్తుంది.
ఇక టైటిల్ పోస్టర్‌ను గమనిస్తే .. చిరంజీవి వెనక్కి తిరిగి నిలబడి చూస్తున్నారు. ఆయన చూపుల్లో ఓ ఇన్‌టెన్స్ కనిపిస్తుంది. అలాగే ఆయన చేతిలో స్టైల్‌గా గన్ పట్టుకుని నిలబడి ఉన్నారు. మోషన్ పోస్టర్, పోస్టర్‌లను గమనిస్తే..మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు కనిపించని ఓ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారని అర్థమవుతుంది. మెగాభిమానులకు ఇవి చాలా ఎగ్జయిట్‌మెంట్‌ను క్రియేట్ చేస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి పవర్‌ఫుల్ రోల్ చేస్తున్న ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ పక్కా యాప్ట్ అవుతుంది. రీసెంట్‌గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చిరంజీవిపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇన్‌టెన్స్ పొటిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మోహన్‌రాజా ఈ చిత్రానికి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేను సమకూర్చారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నిరవ్‌షా విజువల్స్ అందిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, తమన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న తొలి చిత్రమిదే. దీంతో తమన్ చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో స్వరాలను సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఓ సాంగ్ కంపోజిషన్‌ను కూడా తమన్ పూర్తి చేయడం విశేషం. ఎన్నో బాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్‌కు వర్క్‌చేసిన సురేశ్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాతలు: ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్
సమర్పణ: కొణిదెల సురేఖ
బ్యానర్స్: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్
సంగీతం: ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రఫీ: నిరవ్ షా
ఆర్ట్ డైరెక్టర్: సురేశ్ సెల్వరాజన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్