విశ్వంభర..యాక్షన్ సీన్స్‌ అదుర్స్!

19
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ విశ్వంభర. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బ్లాక్‌బస్టర్ ‘బింబిసార’ను అందించిన తర్వాత వశిష్ట, మెగాస్టార్ చిరంజీవిని దర్శకత్వం వహించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ మెగాస్టార్‌ను లార్జర్ దెన్ లైఫ్ పాత్రలో ప్రెజెంట్ చేయడానికి హ్యుజ్ స్పాన్ వున్న కథను సిద్ధం చేశాడు. ఈ చిత్రం జనవరి 10, 2025న విడుదల కాబోతుంది.

ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో హైదరాబాద్‌లోని అల్లుమియం ఫ్యాక్టరీలో చిరంజీవి, కొంతమంది ఫైటర్స్‌పై ప్రస్తుతం హై-ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌ను గ్రాండ్ స్కేల్ లో రూపొందిస్తున్నారు. కీలకమైన దశలో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు అడ్రినలిన్ రష్‌ని అందిస్తుంది.

ఈ యాక్షన్ సీన్ లో మెగాస్టార్ చిరంజీవి రెండో క్యారెక్టర్ రివీల్ అవుతుందని, సినిమా మొత్తానికే ఈ సీన్ మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read:డయాబెటిస్ ఉన్నవాళ్ళు వీటిని తింటే డేంజర్!

- Advertisement -