చిరు ‘విశ్వంభర’లో రాములమ్మ!

35
- Advertisement -

టాలీవుడ్ హిట్ పెయిర్‌లలో టాప్ జంట మెగాస్టార్ చిరంజీవి -విజయశాంతి. వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ముఖ్యంగా వీరిద్దరూ జోడిగా సినిమా వస్తుందంటే అది హిట్ అనేంతలా ప్రేక్షకులు ఆదరించారు. ఇక రీసెంట్‌గా సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటించి మెప్పించారు విజయశాంతి. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా మళ్లీ విజయశాంతితో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పగా దానికి ఆమె కూడా సరేనంది.

సీన్ కట్ చేస్తే తాజాగా చిరు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం విశ్వంభర. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ ఫాంటసీ అడ్వెంచర్‌లో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా మరో సీనియర్ హీరోయిన్‌ కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సెకండాఫ్‌లో వచ్చే ఈ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలవనుందట. ఇక ఈ పాత్ర కోసం విజయశాంతి అయితే బాగుంటుందని దర్శకుడు భావిస్తుండగా ఇందుకోసం ఆమెను సంప్రదించే పనిలో పడ్డారట.

ఒకవేళ ఫాంటసీ అడ్వెంచర్‌లో విజయశాంతి చేరితే అది సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. మరి విజయశాంతి ఓకే చెప్తుందా లేదా వేచిచూడాల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌ లో త్రిష – చిరుల పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. 2025 జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుండగా యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Also Read:KTR: కరీంనగర్ పార్లమెంట్ మనదే

- Advertisement -