సైరాతో ఇంద్రసేన ఫస్ట్ లుక్

228
Chiru unveils 'Indra Sena' First Look
- Advertisement -

‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. బిచ్చగాడు తర్వాత బేతాళుడుతో ముందుకు వచ్చిన విజయ్ అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా ఇంద్రసేన అంటూ ప్రేక్షకుల ముందుకురాబోతన్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘ఇంద్రసేన’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.

శ్రీనివాసన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళంలో ‘అన్నాదురై’గా.. తెలుగులో ‘ఇంద్రసేన’గా తెరకెక్కుతోంది. తనకు ఎంతో ఆప్తురాలైన రాధిక నిర్మిస్తున్న సినిమా అని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మెగాస్టార్. సంగీత దర్శకుడైన విజయ్ ఆంటోని నటుడిగా సత్తా నిరూపించుకున్నారు, ప్రస్తుతం ఈ మూవీకి ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారని ఆయన ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు చిరు.

విజయ్ ఆంథోని మాట్లాడుతూ.. ‘మెగాస్టార్‌తో మా మూవీ ఫస్ట్‌లుక్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. రాధికతో కలసి చేయటం ఈ సినిమాకి కలిసి వచ్చే అంశం. ‘ఇంద్రసేన’ అందరికి నచ్చుతుందని నమ్మకముంది’ అని అన్నారు. రాధిక మాట్లాడుతూ.. ‘ఇంద్రసేన ఫస్ట్‌లుక్‌ను చిరంజీవితోనే ఆవిష్కరించాలని విజయ్ ఆంథోని పట్టుబట్టారు. ఎందుకంటే ‘ఇంద్ర’ లాంటి బ్లాక్ బస్టర్‌ను చిరంజీవి ఇండస్ట్రీకి ఇచ్చారు. ‘ఇంద్రసేన’ ఎమోషనల్ యాక్షన్ మూవీ. నవంబర్‌లో ఈ సినిమాను విడుదల చేస్తాం’ అని చెప్పారు.

విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాధా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు- సాహిత్యం: భాష్యశ్రీ, ఆర్ట్: ఆనంద్ మణి, సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ: కె. దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, నిర్మాతలు: రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.

- Advertisement -