సల్మాన్‌తో గాడ్‌ ఫాదర్‌ చిందులు!

73
chiru
- Advertisement -

తమిళ దర్శకుడు మోహన్‌రాజాతో కలిసి మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర చాలా కీలకంగా ఉండటమే కాదు ఓ పాటలో చిరుతో కలిసి సల్మాన్ కూడా చిందులేస్తాడట. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న మెగాస్టార్, ఈ నెలాఖరున తిరిగి రానున్నారు. ఇక వచ్చిన వెంటనే జూన్ మొదటివారంలో గాడ్‌ఫాదర్ సినిమా కోసం ఓ పాట షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఈ పాట ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది. మలయాళ మూవీ లూసిఫర్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వస్తుండగా చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

- Advertisement -