బన్నీ ఎపిసోడ్‌..చిరు సీరియస్!

11
- Advertisement -

ఏపీ రాజకీయాల్లో అల్లు అర్జున్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. సరిగ్గా పోలింగ్‌కు ఒకరోజు ముందు వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బన్నీ. దీనిని జనసేన నేతలు ట్రోలింగ్ చేయగా నాగబాబు సైతం అగ్నికి ఆజ్యం పోశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే…! ట్వీట్ చేయగా ఇది బన్నీని ఉద్దేశించిందేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.

ఇక దీనిపై వివరణ సైతం ఇచ్చుకున్నారు అల్లు అర్జున్.ఇక ఈ ఎపిసోడ్‌పై చిరు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మన కుటుంబాన్ని వేలెత్తే విధంగా మనం సోషల్ మీడియాలో వైరల్ అవకూడదని, మన పరువును మనమే తీసుకోకూడదని, తిట్టుకున్నా, కొట్టుకున్నా మన కుటుంబం మనదేనని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇకపై ఒకరికి చులకన కాకూడదని..అందులోను రాజకీయాల కారణంగా అసలు చులకన అవడం తనకు ఇష్టం లేదని, గతంలో తాను చేసిన తప్పును మళ్లీ ఇప్పుడు నువ్వు చేస్తున్నావని బన్నీకి సైతం క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.

Also Read:బెండకాయ నీటితో ఉపయోగాలు

- Advertisement -