తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర!

122
cylinder
- Advertisement -

వాణిజ్య సిలిండర్‌ వినియోగదారులకు కాసింత ఊరట. 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.36 తగ్గింది. దీంతో ఢిల్లీలో రూ.2012.50గా ఉన్న సిలిండర్‌ ధర రూ.1976కు చేరింది. తగ్గిన ధరలు నేటినుంచే అమల్లోకి వచ్చాయి.

హైదరాబాద్‌లో రూ.44.50లు తగ్గింది. దీంతో రూ.2242గా 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2197.50కి తగ్గింది. కోల్‌కతాలో రూ.2095.50, ముంబైలో రూ.1936.50, చెన్నైలో రూ.2141గా సిలిండర్‌ ధర ఉన్నది. కాగా, గత నెల 6న వాణిజ్య సిలిండర్‌పై చమురు కంపెనీలు రూ.8.50 తగ్గించాయి.

గత నాలుగు నెలల్లో భారత్‌లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌లపై ధర తగ్గడం ఇది నాలుగోసారి.

- Advertisement -