సినీ పెద్దగా కాదు బిడ్డగా వచ్చాను- మెగాస్టార్ చిరు

130
- Advertisement -

టాలీవుడ్‌లో సినిమా టికెట్ల ధరల విషయంపై గురువారం ఏపీ సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశం ముగిసిన అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళుతూ గన్నవరం విమానాశ్రయంలో చిరు మీడియాతో మాట్లాడారు.. టికెట్ వివాదం జటిలం అవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా నన్ను ఆహ్వానించారు. సినిమా అందరికి అందుబాటులో ఉండాలన్న ఆయన ఆలోచన నాకు నచ్చింది. అలాగే ఎగ్జిబిటర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారని సీఎంకు చెప్పాను. రెండు వైపులా అంశాలను తెలుసుకోవాలని సీఎం జగన్ ఆకాక్షించారు. కోవిడ్ సమయంలో సినీ పరిశ్రమలో కార్మికులు దయనీయ పరిస్థితిలో గడిపారు. సినీ పరిశ్రమ సాధక బాధలను తెలుసుకున్నాను అని సీఎం చెప్పారు. ఉభయ వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారని చిరు అన్నారు.

అలాగే సినిమా టికెట్ల విషయంలో పునరాలోచన చేస్తున్నమని సీఎం చెప్పారు. త్వరలోనే జీవో ఇస్తామని సీఎం చెప్పారు. అంతేకాదు చిన్న సినిమా నిర్మాతల అభ్యర్ధన మేరకు ఐదో షో ఉండాలా లేదా అన్న విషయంపై కూడా ఆలోచన చేస్తామని సీఎం చెప్పారు. అయితే సినిమా పరిశ్రమలోని వ్యక్తులు ఎవరూ లేని పోనీ కామెంట్స్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. పెద్ద బడ్జెట్ సినిమానా లేక చిన్న సినిమానా అన్న భేదం లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా.. రెండు మూడు వారాల్లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే కమిటీ సమావేశనికి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వస్తామని చిరంజీవి తెలిపారు. అయితే నేను సినీ పెద్దగా కాదు బిడ్డగా నేను ఇక్కడి కి వచ్చాను అని చిరు చెప్పారు.

- Advertisement -