చిరు నెక్స్ట్ నిర్మాత ఆమెనా?

20
- Advertisement -

చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్ల షేర్ వసూలు చేసి భారీ విజయం సాధించింది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఘనవిజయంతో ఉబ్బితబ్బిబ్బై తన కూతురు సుస్మిత కోసం ఓ సినిమా చేయాలనుకుంటున్నారు.

సుస్మిత, ఆమె భర్త కొన్నేళ్ల క్రితం నిర్మాణ సంస్థను స్థాపించారు. సుస్మిత ఇటీవల ఒక వెబ్ సిరీస్ మరియు ఒక చిన్న చిత్రాన్ని నిర్మించింది. నిర్మాతగా రాణించి పేరు తెచ్చుకోవాలనేది సుష్మిత డ్రీమ్.

చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోలా శంకర్’ సినిమా చేస్తున్నాడు. ‘భోళా శంకర్‌’ సినిమా పూర్తయిన తర్వాత నిర్మాత దానయ్య కోసం మెగాస్టార్‌ సినిమా చేయాలని భావించినా దర్శకుడు వెంకీ కుడ్ముల చెప్పిన కథ నచ్చకపోవడంతో సినిమా క్యాన్సిల్ అయింది.

ఇప్పుడు భోళా శంకర్ తర్వాత తన కూతురు సుస్మిత కోసం ఓ సినిమా చేయకుంటున్నాడు మెగా స్టార్. ఈ ప్రాజెక్ట్ కి ఇంకా దర్శకుడు కన్ఫర్మ్ అవ్వలేదు. తెలుగు, తమిళ దర్శకులను లైన్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి…

బలగంతో షాకిచ్చావు..చిరంజీవి.!

ఏమిటో ఈ ఉత్తుత్తి పెళ్లి అవసరమా ?

పాన్ ఇండియా హీరోల సంక్రాంతి పోటీ!

- Advertisement -