చిరు-కొరటాల మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్‌..!

520
chiru koratala
- Advertisement -

సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి..కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనన్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుండగా ఈ మూవీలో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు మెగాస్టార్.

అయితే ఇంకా సినిమా షూటింగే మొదలు కాలేదు అప్పుడే రిలీజ్ డేట్‌ని ప్రకటించేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతోన్నట్లు సమాచారం. ఆగస్టు 14..2020లో సినిమా విడుదల చేయనున్నట్లు టాక్.

మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించనున్నారు. చిరు ఇమేజ్‌కు తగ్గట్లుగా కొరాటల శివ కథను సిద్ధం చేయగా ఈ మూవీలో డిఫరెంట్ లుకు కోసం మెగాస్టార్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నాడు.

- Advertisement -