చిరు మెగా పార్టీ…మిస్సైందెవరో తెలుసా..!

652
chiru mega party
- Advertisement -

1980ల నాటి సినీ తారలు ఏటా ఏదో ఒక చోట కలిసి సందడి చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈసారి ఈ వేడుకలకు మెగాస్టార్‌ చిరంజీవి ఇల్లు వేదికైంది. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో 80ల నాటి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నటులు ఒక చోట కలిసి సందడి చేశారు.

ఈ ఆత్మీయ కలయికలో వెంకటేష్, నాగార్జున, మోహన్ లాల్, రాధిక, శరత్ కుమార్, ప్రభు, రెహమాన్, భానుచందర్, నరేష్‌, సురేష్‌, జయసుధ, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, భాగ్యరాజ్‌, జాకీ ష్రాఫ్‌, జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు.

అయితే ఈ సారి వేడుకలకు దూరమయ్యారు సూపర్ స్టార్ రజనీకాంత్,కమల్ హాసన్,బాలకృష్ణ,రాజశేఖర్. బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ కూడా ఈ వేడుకలకు హాజరుకాగా రజనీ,బాలకృష్ణ దూరం కావడం చర్చనీయాంశంగా మారింది.

Class of the 80s’ is an annual event in which stars from the south film industry who acted in the films 1980s will reunite and reminisce

- Advertisement -