ఫుల్ జోష్ లో మెగా ఫ్యాన్స్

27
- Advertisement -

ప్రశాంత్‌ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్‌ లో తెరకెక్కిన హను మాన్ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో పెద్ద విజయాన్ని అందుకుంది. అయితే, ఈ సినిమా పై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న జై హనుమాన్లో శ్రీరాముని పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడని, హనుమాన్ పార్ట్ 2 మొత్తం రామ్ చరణ్ కనిపిస్తాడని ఓ రూమర్ స్ప్రెడ్ అవుతోంది. దీంతో మెగా అభిమానులు ఇది నిజమైతే బాగుంటుందని కోరుకుంటున్నారు.

చిన్న బడ్జెట్‌తో టాలీవుడ్ లో తెరకెక్కించిన ఈ ‘హను-మాన్‌’ చిత్రం అటు నార్త్ లో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. పైగా మన సంస్కృతిని, చరిత్రను గొప్పగా చూపించారు. అదేవిధంగా రామాయణ, మహాభారతాలను నేటి ప్రేక్షకులకు సహజమైన శైలిలో చెప్పాలనుకుంటున్నాను అంటూ ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే చరణ్ కూడా ప్రశాంత్ వర్మ ఐడియాలు నచ్చి.. హనుమాన్ 2 సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడని టాక్ నడుస్తోంది.

అలాగే, మెగా ఫ్యాన్స్ కి మరో క్రేజీ న్యూస్ కూడా వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని మ‌రో అత్యున్న‌త పుర‌స్కారం వ‌రించిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం.. ‘పద్మవిభూషణ్’ అవార్డు చిరంజీవికి ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై రిప‌బ్లిక్ డే రోజు అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు స‌మాచారం. అభిమానులు ఈ సంతోషకరమైన వార్త కోసం ఎదురు చూస్తూ పోస్టులు చేస్తున్నారు. మొత్తానికి మెగా అభిమానులకు ఈ రెండు వారలు ఫుల్ కిక్ ను ఇస్తున్నాయి.

Also Read:జగన్ వర్సెస్ షర్మిల.. పులివెందుల ఫైట్?

- Advertisement -