ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల విరాళాలు..

4
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పలువురు, సినీ రాజకీయ ప్రముఖులు విరాళాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు విరాళం అందజేశారు మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్ తరపున మరో 50లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు చిరంజీవి.

రెండు చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు మెగాస్టార్. అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందజేశారు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3లక్షలు విరాళంగా అందజేశారు సినీ నటుడు అలీ.

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షలు విరాళంగా అందించారు సినీ నటుడు విశ్వక్ సేన్. జూబిహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్స్ అందజేశారు ప్రముఖులు.

Also Read:లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్

- Advertisement -