చిరు దర్శకత్వంలో వినాయక్..

178
Chiru Directs Vinayak
- Advertisement -

ద‌ర్శ‌కుడే హీరోని డైరెక్ట్ చేయ‌డం రొటీన్‌..! హీరోనే ద‌ర్శ‌కుడిని డైరెక్ట్ చేస్తే !? .. అది కాస్త డిఫ‌రెంట్‌!! అది కూడా 150 సినిమాల్లో న‌టించిన ఓ అగ్ర‌ క‌థానాయ‌కుడు కెప్టెన్ చైర్‌లో కూచుని.. త‌న‌ డైరెక్ట‌ర్‌ న‌టించే స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తే ఇంట్రెస్టింగ్ అన‌కుండా ఉండ‌లేం. ప్ర‌స్తుతం `ఖైదీ నంబ‌ర్ 150` సెట్స్‌లో అలాంటి అరుదైన‌ స‌న్నివేశం ఒక‌టి క‌నిపించింది. వి.వి.వినాయ‌క్ ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్‌లో ఉన్న `ఖైదీ నంబ‌ర్ 150` లో ఓ స‌న్నివేశంలో న‌టించారు. ఆ స‌న్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హైద‌రాబాద్ సార‌థి స్టూడియోస్‌లో ఈ షాట్‌ని మంగ‌ళ‌వారం ఉద‌యం చిత్రీక‌రించారు.

ఇంత‌కాలం మెగాస్టార్ న‌టిస్తుంటే ఆ స‌న్నివేశాలను డైరెక్ట్ చేసిన వినాయ‌క్ ఇప్పుడిలా న‌టుడిగా మారిపోవ‌డం… త‌ను న‌టించే సీన్‌ని అన్న‌య్య స్వ‌యంగా డైరెక్ట్ చేయ‌డం.. రేర్ మూవ్‌మెంట్‌. త‌న జీవితంలో మ‌ర‌పురాని అనుభూతిని మిగిల్చిన సంద‌ర్భం. అయితే వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కించిన‌ `ఠాగూర్‌` చిత్రంలోనూ ఓ స‌న్నివేశంలో న‌టించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. మ‌రోసారి ఇలా అరుదైన ఛాన్స్ వినాయ‌క్‌కి ద‌క్కింద‌న్న‌మాట‌! ఈ షాట్‌ని మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట‌ర్ చేయ‌డం ఓ సెన్సేష‌నే.

- Advertisement -