నిర్మాతగా మారిన చిరు పెద్ద కూతురు..!

332
susmitha
- Advertisement -

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే హీరోలుగా, నిర్మాతలుగా,హీరోయిన్లుగా డజను మందికిపైగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ అటూ హీరోగాను నిర్మాతగాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు.

తాజాగా రామ్ చరణ్ అక్క సుస్మిత కూడా ప్రొడక్షన్‌ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణిస్తున్న సుస్మిత ఇకపై నిర్మాతగా మారనున్నారు. గోల్డ్ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్ అనే బ్యానర్‌ని స్ధాపించిన సుస్మిత వెబ్ సిరీస్‌లను నిర్మించనున్నారు.

క్రైమ్‌ డ్రామా నేపథ్యంతో ఈ వెబ్‌సిరీస్‌ రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. విభిన్నమైన కథ, కథనాలతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. తొలుత వెబ్ సిరీస్‌ తర్వాత సినిమాలు కూడా నిర్మిస్తానని తెలిపారు సుస్మిత.

- Advertisement -