ప్రిన్స్ మహేష్ బాబు-కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భరత్ అను నేను. మహేష్ బాబు సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే రూ. 160 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన భరత్…పలు రికార్డులను తిరగరాసింది.
ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు గుప్పించగా మెగాస్టార్ చిరంజీవి భరత్ సినిమాకు ఫిదా అయ్యారు. తొలి రోజే ఫ్యామిలీతో కలిసి సినిమా చూశానని తెలిపిన చిరు…కొరటాల శివ అద్భుతంగా నటించాడని తెలిపారు. మహేష్ నటన సూపర్బ్ అని తెలిపిన మెగాస్టార్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా బాగుందన్నారు. సినిమా ద్వారా అద్భుతమైన మెస్సేజ్ ఇచ్చాడని చిరు ప్రశంసలు గుప్పించారు.
ఇక ఈ సినిమాలో ప్రెస్ కాన్ఫరెన్స్ సీన్‌కు ఫిదా అయ్యానని తెలిపారు చిరంజీవి. జర్నలిస్టులను ప్రశ్నించే సీన్‌కు చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయానని చెప్పారు. సినిమాలో అది అత్యద్భుతమైన సన్నివేశం అని చిరు అన్నారు. చిరుతో పాటు జక్కన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ సీన్ అద్భుతమని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా మహేష్ నటనకు విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు.