Nithin:చిరు క్లాప్ తో నితిన్ సినిమా

63
- Advertisement -

నితిన్ , రష్మిక జంటగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయింది. మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తం షాట్ కి క్లాప్ ఇచ్చారు. భీష్మ సక్సెస్ తర్వాత చిరంజీవితో వెంకీ కుడుముల సినిమా ఎనౌన్స్ అయింది. కానీ కొన్ని కరణాల వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. వెంటనే వెంకీ నితిన్ కి స్టోరీ చెప్పేసి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. తను తెలుగులో లాంచ్ చేసిన రష్మిక డేట్స్ పట్టేశాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.

నిజానికి ఒక ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యాక ఆ హీరో -దర్శకుడు పెద్దగా కలవరు. కానీ వెంకీ రిక్వెస్ట్ మేరకు చిరు సినిమా ఓపెనింగ్ కి ఇచ్చేయడంతో వీరిద్దరి మధ్య ఇంకా అదే బాండింగ్ ఉందని రోజువైంది. చిరుకి ఈ కుర్ర దర్శకుడితో ఎలాంటి విభేదాలు లేవని ఈ ఓపెనింగ్ తో రుజువైంది. భీష్మ తర్వాత మళ్ళీ అదే కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు.

ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. రష్మిక పుష్ప 2 లో ఘాట్ తో బిజీ గా ఉంది. ఆ రెండు షూటింగ్స్ ఓ కొలిక్కి రాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. లేదంటే నితిన్ , రష్మిక డేట్స్ కుదిరినప్పుడల్లా ఒక్కో షెడ్యూల్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు వెంకీ.

ఇవి కూడా చదవండి..

- Advertisement -