అమెరికా పర్యటనకు చిరు, బాలయ్య

201
Chiru
- Advertisement -

నటసింహాం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సూపర్ హిట్‌ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రయోగాత్మకంగా చారిత్రాత్మకంగా తెరకెక్కిన శాతకర్ణికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో..ఇటు తెలుగు రాష్ట్ర్రాలతో పాటు అటు యూఎస్‌ఎలో కూడా దూసుకుపోతోంది. తెలుగులో ఇప్పటికే 50 కోట్లపైనే వసూలు చేయగా..అటు యూఎస్‌ఏలో మిలియన్ డాలర్ల మార్క్‌ ను దాటేసింది. శాతకర్ణి సినిమాతో బాలయ్య తొలిసారిగా యూఎస్‌ఎలో మిలియన్ మార్క్ ను అందుకున్నాడు.

Chiru

యూఎస్‌ఏలో శాతకర్ణి సినిమాకు వస్తున్న రెస్పాన్స్ దృష్ట్యా..అభిమానుల్లో మరింత జోష్ పెంచేందుకు బాలయ్య అమెరికా టూర్‌కు సిద్ధమైయ్యాడు. ఓవర్సీస్ అభిమానుల ఆహ్వానం మేరకు..కలెక్షన్లను రెండు మిలియన్ల మార్క్‌ను దాటించేందుకు అమెరికా పయనం కాబోతున్నాడు. జనవరి 18న తన తండ్రి ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాలో పాల్గొని ఆ తర్వాత జనవరి 19న అమెరికాలో అడుగుపెట్టనున్నాడు. బాలయ్య అమెరికా పర్యటన షెడ్యూల్‌ను అక్కడి అభిమానుల సంఘం ఇప్పటికే ఖరారు చేసింది. అభిమానుల సంబరాలను మరింత రెట్టింపు చేసేలా ఈ కార్యక్రమాల్లో దర్శకుడు క్రిష్, హీరోయిన్ శ్రియ కూడా పాల్గొననున్నారు. జనవరి 19న అమెరికాలో థాంక్స్ మీట్ ఏర్పాటు చేస్తారు. మొత్తం అయిదు ప్రధాన నగరాల్లో బాలయ్య పర్యటన ఉండనుంది. రోజుకు రెండు థియేటర్ల వద్దకు ఈ టీం వెళ్లనుంది.

జనవరి 19న బే ఏరియా, జనవరి 20న డల్లాస్, జనవరి 21న డెట్రాయిట్, జనవరి 22న ఫిలడెల్ఫియా, జనవరి 22న న్యూజెర్సీ నగరాల్లో వీరి పర్యటన ఉంటుంది. కాగా.. శాతకర్ణి ఇప్పటికే 1.25 మిలియన్ డాలర్లు దాటింది. ఈ సినిమాకు లాంగ్ రన్‌లో 1.5 మిలియన్ డాలర్లు దాటడం కష్టమేమీ కాదు. అయితే బాలయ్య, క్రిష్, శ్రియ అమెరికా పర్యటన.. ఈ కలెక్షన్లను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. వీరి పర్యటన ఉండే అయిదు రోజుల్లో మొత్తం రెండు మిలియన్ డాలర్ల మార్కునే దాటే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Chiru

శాతకర్ణి మూవీ ప్రమోట్ కోసం బాలయ్య అమెరికా టూర్‌కు వెళుతుంటే..మరోపక్క మెగాస్టార్ చిరంజీవి కూడా ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రమోషన్ కోసం యూఎస్‌ఏ పర్యటనకు ప్లాన్ చేస్తున్నాడు. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఖైదీ యూఎస్‌ఏలో కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రెండు మినియన్ల డాలర్లు వసూలు చేసింది. దీంతో ఖైదీ సినిమాను విజయవంతం చేసినందుకు యూఎస్‌ఏ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపేందుకు చిరంజీవి కూడా అమెరికా టూర్‌కు ప్రయణం కాబోతున్నాడు. కాకపోతే అఫీషియల్‌ డేట్స్‌ ఇంకా అనౌన్స్ చేయలేదు. మొత్తానికి పోటాపోటీగా సంక్రాంతి బరిలో నిలిచి పెద్ద హిట్లను సొంతం చేసుకున్న బాలయ్య, చిరు ప్రమోషన్స్ విషయంలో కూడా పోటీ పడి అమెరికా టూర్‌కు పయనమవుతున్నారు.

- Advertisement -