చిరు , బాలయ్య మళ్ళీ పోటీ?

54
- Advertisement -

చిరంజీవి , బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. చిరు ‘వాల్తేరు వీరయ్య’ తో ప్రేక్షకులను పలకరిస్తే , బాలయ్య వీర సింహా రెడ్డి తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరూ తమ సినిమాలతో సంక్రాంతి బ్లాక్ బాస్టర్స్ అందుకున్నారు. కానీ ఫైనల్ గా చిరు నే బాలయ్య పై కలెక్షన్స్ తో పై చేయి సాధించాడు.

అయితే సంక్రాంతికి ఈ ఇద్దరు పోటీ పడబోతున్నారనే వార్త రిలీజ్ డేట్స్ ప్రకటించినప్పటి నుండి హాట్ టాపిక్ అయింది. టాలీవుడ్ లో ఎక్కడ చూసిన ఇదే చర్చ నడిచింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరు పోటీ పదే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. చిరు ‘భోలా శంకర్’ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు. బాలయ్య అనిల్ రావిపూడి తో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు కూడా ఒకే టైమ్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. దసరా లేదా సంక్రాంతి కి ఈ రెండు సినిమాలతో మళ్ళీ బాలయ్య , చిరు పోటీ పడతారని ఇన్సైడ్ టాక్. ఏదేమైనా సీనియర్ హీరోల బాక్సాఫీస్ పోటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంటే. మరి రిలీజ్ డేట్స్ ప్రకటించే వరకు ఈ పోటీ డిక్లర్ అవ్వదు. అప్పటి వరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి…

నేడు హాస్య న‌ట‌ శిఖ‌రం పుట్టినరోజు

దళపతి67..త్రిష కృష్ణన్‌

మైఖేల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నాని

- Advertisement -