పరుగులు పెడుతున్న చిరు , బాలయ్య

110
- Advertisement -

వచ్చే ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా చిరు ‘వాల్తేర్ వీరయ్య’ , బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ థియేటర్స్ కి వస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కి ఇంకా నెలన్నరే ఉంది. ఈ లోపు చిరు , బాలయ్య టార్గెట్ పెట్టుకొని షూటింగ్ తో పరుగులు పెడుతున్నారు. అవును రెండు సినిమాలకు సంబంధించి ఇంకా షూట్ మిగిలి ఉంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్ జరుగుతుంది. చిరంజీవి , రవితేజ పై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. మరో వైపు హైదరాబాద్ శివారు ప్రాంతంలో బాలయ్య , విలన్ దునియా విజయ్ లపై ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు.

రెండు సినిమాలకు ఇంకా ఒక్కో సాంగ్ బ్యాలెన్స్ ఉంది. రెండూ డ్యూయట్సే. శృతి హాసన్ డేట్స్ కోసం చూస్తున్నారు. ఆమె డేట్స్ ఇవ్వడమే ఆలస్యం సాంగ్స్ షూట్ జరుపుకుంటాయి. ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య షూటింగ్ త్వరగా ముగించుకొని ‘భోళా శంకర్’ సినిమా షెడ్యుల్ మొదలు పెట్టాల్సి ఉంది. బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయాల్సిన సినిమాకు ఆల్రెడీ ముహూర్తం ఖరారైంది.

డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు బాలయ్య. అక్కడి నుండి NBK108 రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. అంటే బాలయ్య చేతిలో వారమే ఉంది. ఈ లోపు వీర సింహా రెడ్డి కి గుమ్మడి కాయ కొట్టాలి. మరి చిరు , బాలయ్య సంక్రాంతి పోటీలో నిలవడం వల్ల చివరి నిమిషంలో పరుగులు పెట్టాల్సి వస్తుంది.టైం లేకపోవడంతో దర్శకులు ఈ సినిమాలను చుట్టేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -