చిరు 154 ఆసక్తికర అప్‌డేట్!

90
154
- Advertisement -

వరుస సినిమాలో ఈ ఏడాది అలరించేందుకు సిద్ధమవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే చిరు – కొరటాల కాంబోలో తెరకెక్కిన ఆచార్య విడుదలకు సిద్ధంగా తర్వాత భోళాశంకర్, లూసిఫర్ రీమేక్ ప్రాజెక్టులతో పాటు వెంకి కుడుముల,బాబీతో ఇలా వరుస సినిమాలకు కమిట్ అయ్యారు చిరు.

ఈ నేపథ్యంలో చిరు – బాబి సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇది చిరంజీవికి 154వ సినిమా కాగా బాబీ టీం హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ కొన‌సాగిస్తుంద‌ట‌. ఫైట్ మాస్ట‌ర్స్ రామ్‌-ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో హై వోల్టేజీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ఇవాళ్టి షూటింగ్ మొద‌లైంద‌ని టాలీవుడ్ స‌ర్కిల్ టాక్‌.

చిరు సరసన శృతిహాస‌న్ హీరోయిన్‌గా నటిస్తుండగా కంప్లీట్ మాస్ అండ్ యాక్ష‌న్ ప్యాక్‌డ్ రోల్‌లో సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.

- Advertisement -