చిరు ‘గాడ్ ఫాదర్’ లుక్‌ వచ్చేసింది..

96
- Advertisement -

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా సూపర్ హిట్టైన ‘లూసీఫర్’ తెలుగులో రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆగష్టు 13న ఈ సినిమా షూటింగ్ అఫీషియల్‌గా మొదలైంది. లైట్స్, కెమెరా, యాక్షన్ అంటూ చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్ స్టార్ట్ చేసారు డైరెక్టర్ మోహన్ రాజా. ఈ మూవీ శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్ష‌న్స్‌, సూప‌ర్ గుడ్ ఫిలింస్ పతాకాల‌పై ఆర్‌.బి.చౌద‌రి, ఎన్‌.వి.ప్ర‌సాద్ నిర్మాత‌లుగా రూపొందుతోన్నది.

తాజాగా ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఆదివారం(ఆగ‌స్ట్ 22) రోజున మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘గాడ్ ఫాదర్’ టైటిల్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. టైటిల్ లుక్‌ను గ‌మ‌నిస్తే… కోటు వేసుకుని, టోపి పెట్టుకుని చేతిలో గ‌న్ పెట్టుకుని చిరంజీవి వెన‌క్కి తిరిగి ప‌క‌క్కు చూస్తూ నిట‌బ‌డి ఉన్నారు. గాడ్ ఫాద‌ర్ అనే టైటిల్‌లో ఏ అనే అక్ష‌రాన్ని మ‌ధ్య‌లో చేత గ‌న్ ప‌ట్టుకుని చిరంజీవి నిల‌బ‌డి ఉండ‌టాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ రీమేక్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ పనిచేస్తున్నారు.

ఇక ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్ విద్యాబాలన్ లేదా కోలీవుడ్‌ బ్యూటీ నయనతార మెగాస్టార్ కి సిస్టర్‌గా నటించబోతుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది. మరో కీలకపాత్రలో యువ హీరో సత్యదేవ్ నటిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం. మరోవైపు వరుణ్ తేజ్.. చిరంజీవి బ్రదర్ పాత్రలో సీఎంగా కాసేపు అలరించనున్నట్టు సమాచారం.మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ టైటిల్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది.

- Advertisement -